APVVP బలవంతపు ఫారిన్ డిప్యుటేషన్ పరిస్థితి ఏమిటి కాంట్రాక్ట్ ఉద్యోగులం మేం మనుషులం కాదా
2018 లో DPH & FW పరిధి నుంచి CHC లను APVVP కు బదలాయింపు చేశారు.
సిబ్బందిని ఫారిన్ డిప్యుటేషన్ తో ఉత్తర్వులు ఇచ్చి కొనసాగించసారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్నా కనీసం నెలనెలా జీతాలు ఇవ్వలేకపోయారు. అప్పటి నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులపై సవతి తల్లి ప్రేమ కొనసాగుతూనే ఉంది. రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రం ఆప్షన్స్ అడిగారు. ఇష్టమున్న వాళ్ళు APVVP లో ఉన్నారు. ఇష్టంలేనివారు DH పరిధికి వెళ్లినారు. కాంట్రాక్ట్ ఉద్యోగులమైన మాకు ఆప్షన్స్ అడగలేదు.మా అపాయింటింగ్ అధికారి DMHO. మరి మమ్ములను APVVP లో బలవంతంగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మేము కోరేది ఒక్కటే, మాకు ఆప్షన్స్ అడగాలి, ఇష్టమున్న వాళ్లు ఉంటారు, ఇష్టం లేనివాళ్ళు DH పరిధికి వెళ్ళిపోతారు.
ప్రస్తుతం నియామకాలకు ఉత్తర్వులు ఇచ్చి ప్రక్రియ చూస్తున్నారు. ఉన్న కాళీలు భర్తీ జరిగితే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తితే మా పరిస్థితి ఏమిటి. మళ్లీ కోర్టుల చుట్టు తిరగాలి. మమ్ములను ఇబ్బందులు పెట్టొద్దు. మేము ఇంకా బలవంతపు ఫారిన్ డిప్యుటేషన్ మీదే ఉన్నాము. మాసమస్య మానవతాదృక్పదం తో పరిష్కారం చేయాలని విజ్ఞప్తి. చిన్న చిన్న సమస్యలు న్యాయబద్ధమైన సమస్యలు కూడా పరిష్కారం కావడంలేదు. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి APVVP లో ఫారిన్ డిప్యుటేషన్ తో కొనసాగుతున్న వారిని వారి స్వంత శాఖకు పంపించి న్యయంచేయాలని కాంట్రాక్టు ఉద్యోగులు కోరుతున్నారు.

0 Comments